: ఇండియా లేకున్నా నష్టమేం లేదు: చైనా

బీజింగ్ లో 'వన్ బెల్ట్ వన్ రోడ్'పై సదస్సును చైనా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సదస్సుకు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, ఇండియా మాత్రం దీనికి గైర్హాజరైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్-బాల్టిస్థాన్ నుంచి ఈ రోడ్డు వెళుతుండటంతో... ఈ కార్యక్రమాన్ని భారత్ బహిష్కరించింది. దీనిపై ఆ దేశ మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. వన్ బెల్ట్ వన్ రోడ్ కార్యక్రమంలో భారత్ పాలుపంచుకున్నా, లేకపోయినా మిగిలిన దేశాలకు పెద్దగా నష్టం లేదని తెలిపింది. అయితే, ఒక దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే ఎలాంటి పనులను చైనా చేయదంటూ తమ అధినేత జిన్ పింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తన కథనంలో తెలియజేసింది. 

More Telugu News