: ట్రంప్ హెచ్చరికలు పక్కనబెట్టి నార్త్ కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం... 750 కి.మీ వెళ్లి రష్యాకు దగ్గరగా పడిన మిసైల్

మరో మారు క్షిపణి పరీక్షలు చేయవద్దని చెబుతూ, అమెరికా, చైనాలు హెచ్చరించినా వినని ఉత్తర కొరియా కీలక పరీక్ష చేసి కలకలం రేపింది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 5:30 గంటల సమయంలో ఓ ఖండాంతర క్షిపణిని పరీక్షించారు. కుసాంగ్ ప్రాంతం నుంచి దీన్ని ప్రయోగించగా, 500 మైళ్లకు పైగా (సుమారు 750 కి.మీ) ప్రయాణించిన క్షిపణి, రష్యా పట్టణం వ్లాడివోస్టోక్ కు 60 మైళ్ల దూరంలో పడిందని చెప్పారు. ఈ మిసైల్ మరికాస్త దూరం వెళితే రష్యాపై పడేదని తెలుస్తోంది. ప్రయోగం జరిగిన విషయాన్ని అమెరికా, దక్షిణ కొరియాలు స్పష్టం చేశాయి. ఇటీవలి కాలంలో ఉత్తర కొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ దూకుడు వైఖరిని ప్రదర్శిస్తూ, అమెరికాతో యుద్ధానికి కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News