అమెజాన్ లో స్మార్ట్ ఫోన్ లపై ఆఫర్లు!

Sat, May 13, 2017, 06:06 PM
అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ పేరిట నాలుగు రోజులు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ ఆఫ‌ర్లు రేప‌టితో ముగియ‌నున్నాయి. మూడవ రోజయిన ఈ రోజు ప‌లు ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల‌పై అమెజాన్ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లెట్స్, ల్యాప్‌టాప్స్, గేమింగ్ కన్సోల్స్ వంటి వాటిపై ఈ రోజు డిస్కౌంట్లు పొంద‌వ‌చ్చు.  
 
ఈ రోజు అమెజాన్ అందిస్తోన్న ఆఫ‌ర్ల ప్ర‌కారం....
 
* ఐఫోన్ 5ఎస్, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 7పై ఎక్స్‌ఛేంజ్ పై రూ.11వేల వర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు
* శాంసంగ్ గెలాక్సీ సీ7 ప్రొ, మోటో జడ్, వన్ ప్లస్3 ఫోన్ల ఎక్స్‌ఛేంజ్‌పై కూడా రూ.11 వేల వ‌ర‌కు డిస్కౌంట్
* మోటో జీ5, మోటో జీ4 ప్లస్‌లపై ప్లాట్‌ రూ.1000 ఆఫర్
* మోటో జీ5, మోటో జీ4 ప్లస్‌ల ఎక్స్‌ఛేంజ్‌పై వరుసగా రూ.8,600, రూ.9,112కు వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు

మరిన్ని వివరాలు, డిస్కౌంట్ల కోసం అమెజాన్ వెబ్ సైట్ చూడవచ్చు. 
Tags:
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement