: యూనిస్ ఖాన్ కు 'గార్డ్ ఆఫ్ ఆనర్' ఇచ్చిన వెస్టిండీస్ ఆటగాళ్లు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు సీనియర్ బ్యాట్స్‌ మన్ యూనిస్ ఖాన్‌ చివరి టెస్టు ఆడుతున్నాడు. రిపబ్లిక్ ఆఫ్ డొమినికాలోని విండ్ సర్ పార్క్ లో వెస్టిండీస్ తో జరుగుతున్న చివరి టెస్టులో యూనిస్ ఖాన్ బ్యాటింగ్ కు దిగిన సందర్భంగా 'గార్డ్ ఆఫ్ ఆనర్' ఇచ్చారు. 17 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్‌ ఆడిన యూనిస్ ఖాన్...116 టెస్టులాడి 10,041 పరుగులు చేసిన ఏకైక పాక్ బ్యాట్స్ మన్ గా రికార్డుల్లో నిలిచాడు.

 2000వ సంవత్సరంలో టెస్టు క్రికెటర్ లో అరంగేట్రం చేసిన యూనిస్ ఖాన్...రిటైర్మెంట్ ప్రకటించడంతో ఒక తరం క్రికెట్ శకం ముగిసినట్టైంది. ఈ టెస్టు యూనిస్ ఖాన్ తో పాటు, ఆ జట్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ కు కూడా చివరిదే...అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఆలస్యంగా అరంగేట్రం చేసిన మిస్బా...వయసు పైబడడంతో రిటైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వీరిద్దరూ చివరి టెస్టును విండీస్ పై ఆడుతున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగుతున్న యూనిస్‌ ఖాన్ కు విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ తో పాటు ఇతర ఆటగాళ్లంతా వరుసగా నిలబడి మైదానంలోకి ఆహ్వానించారు. దీంతో యూనిస్ భావోద్వేగానికి గురయ్యాడు.

More Telugu News