: పరిస్థితిని సొమ్ము చేసుకునే యోచన... బీసీసీఐకి దక్షిణాఫ్రికా బెదిరింపులు!

నిన్న మొన్నటి వరకూ ప్రపంచ క్రికెట్ ను శాసించిన బీసీసీఐ, ఇప్పుడంత బలంగా లేదని భావించిన దక్షిణాఫ్రికా, గతంలో బీసీసీఐ నుంచి పొందిన లాభాలను మరచి బెదిరింపులకు దిగుతోంది. ఈ సంవత్సరం ఆఖరులో దక్షిణాఫ్రికాలో ఇండియా పర్యటించాలన్న ప్రతిపాదన ఉండగా, అదింకా ఖరారు కాని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశానికి ఇండియా వచ్చి ఆడితేనే 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీల్లో తమ దేశపు ఆటగాళ్లు పాల్గొనేందుకు అనుమతి ఇస్తామని చెబుతూ క్రికెట్ దక్షిణాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరూన్ లొర్గాత్ లేఖ రాశారు. భారత క్రికెట్ జట్టు పర్యటనను బీసీసీఐ ధ్రువీకరిస్తేనే తమ ఆటగాళ్లు అందుబాటులో ఉంటారని తేల్చి చెప్పాడు. ఈ లేఖ తమకు అందిందని, సరైన సమయంలో క్రికెట్ సౌతాఫ్రికా అధికారులతో మాట్లాడతామని బీసీసీఐ సీఈఓ జోహ్రీ వెల్లడించారు.

More Telugu News