: భారత్ తో బేరసారాలు మొదలుపెట్టిన చైనా

పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా చైనా చేపట్టిన చైనా పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో, భారత్ ను శాంతింపజేసేందుకు బేరసారాలు చేస్తోంది చైనా. అవసరమైతే ఈ ప్రాజెక్టు పేరును మారుస్తామని చైనా చెబుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకూడదన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ను ఇస్తున్నట్టు భారత్ లో చైనా అంబాసడర్ లూ జావోహుయ్ తెలిపారు. ఆర్థిక సహకారంలో భాగంగానే ఈ ప్రాజెక్టును చేపట్టామని... భారత్ సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడం తమ ఆలోచన కాదని అన్నారు. పాకిస్థాన్ కు తాము ఎలాంటి సాయం చేయడం లేదని... తమకు తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు.


More Telugu News