: రహస్య పరిశోధన కోసం రెండేళ్లు గా ఆకాశంలో తిరుగుతున్న అంతరిక్ష విమానం

రెండేళ్లుగా రహస్య పరిశోధన కోసం ఆకాశంలో తిరుగుతున్న అంతరిక్ష విమానం ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ అంతరిక్ష కేంద్రంలో నిన్న దిగింది. అమెరికాకు చెందిన ఈ ప్రయోగాత్మక ఎక్స్‌-37బీ అంతరిక్ష విమానం...మానవరహిత విమానం. దీనిని బోయింగ్ సంస్థ తయారు చేసింది. 2015 మే నెలలో కేప్‌ కెనేవెరల్‌ వైమానికస్థావరం నుంచి దీనిని అంతరిక్షంలోకి ప్రయోగించారు. గూఢచార సంబంధిత హార్డ్‌ వేర్‌ పై పరీక్షలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా విమాన సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారని సెక్యూర్‌ వరల్డ్‌ ఫౌండేషన్‌ అనే ఎన్జీవో (లాభాపేక్షరహిత సంస్థ) చెబుతోంది. కాగా, రహస్య ప్రయోగాల్లో భాగంగా ఈ విమానం ఇప్పటికి మూడు సార్లు కాలిఫోర్నియాలోని వాండెన్‌ బెర్గ్‌ వైమానిక స్థావరం నుంచి అంతరిక్షానికి వెళ్లి వచ్చిందని తెలుస్తోంది.

More Telugu News