: బెంగళూరు, గుజరాత్ లకు నో చాన్స్... మిగిలిన ఆరింటిలో వెనుదిరిగే రెండు జట్లపై సస్పెన్స్!

ఐపీఎల్ పదో సీజన్ లో ఓడలు బళ్లుగా మారాయి. గత సంవత్సరం టాప్-2లో ఉన్న గుజరాత్, బెంగళూరు జట్లు, ఈ దఫా కిందనుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకున్నాయి. ఈ రెండు జట్లూ చెరో మూడు మ్యాచ్ లు ఆడాల్సి వున్నప్పటికీ, ఆ మూడూ గెలిచినా కూడా తదుపరి దశకు వెళ్లే అవకాశాలు లేవు. ఇక మిగతా ఆరు జట్లలో టాప్ లో నిలిచిన ముంబై జట్టు దాదాపుగా ప్లే-ఆఫ్ స్థానాన్ని ఖరారు చేసుకున్నట్టే.

మిగిలిన ఐదు జట్లు సన్ రైజర్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పుణె సూపర్ జెయింట్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల నుంచి మరో మూడు జట్లకు ప్లే ఆఫ్ చాన్స్ దక్కనుంది. వీటిల్లో 11 మ్యాచ్ లు ఆడి ఏడింట్లో విజయం సాధించిన కేకేఆర్, ఆర్పీఎస్ జట్లకు మెరుగైన అవకాశాలుండగా, ఆరు మ్యాచ్ లు గెలిచిన సన్ రైజర్స్ మరో రెండు విజయాలు సాధించాల్సి వుంది. 10 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ, 9 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ జట్లు ఎనిమిదేసి పాయింట్లతో తామూ బరిలో ఉన్నామని గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై సాగే పోటీలు మరింత రసవత్తరంగా ఉంటాయని క్రీడా పండితులు అంచనా వేస్తున్నారు.

More Telugu News