: గంభీర్ తప్ప మిగతా టీమిండియన్లు అందరూ నాకు స్నేహితులే!: షాహిద్ అఫ్రిదీ

టీమిండియా ఆటగాళ్లతో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్‌ అఫ్రీది అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐసీసీ కాలమ్ రాసిన అఫ్రిదీ దాయాదులతో తన అనుబంధాన్ని నెమరు వేసుకున్నాడు. భారత్, పాక్ జట్ల క్రికెటర్ల మధ్య సుహృద్భావ సంబంధాలే ఉండేవని అఫ్రీది తెలిపాడు. తాము బద్ధ శత్రువుల్లా ఉంటామని, కీచులాడుకుంటామని అంతా అనుకుంటారని, కానీ అందులో వాస్తవం లేదని, తమ రెండు దేశాల క్రికెటర్ల నడుమ చక్కటి సంబంధాలు ఉండేవని అన్నాడు. అందులో గౌతమ్ గంభీర్‌ కు మాత్రం మినహాయింపు ఉందన్నాడు. టీమిండియాలోని తన స్నేహితుల జాబితాలో గంభీర్ లేడని అఫ్రీది తెలిపాడు. కొన్నేళ్ల క్రితం మైదానంలో తమ ఇద్దరి మధ్య చోటుచేసుకున్న వివాదం పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందేనని గుర్తు చేశాడు.

అయితే ఇలాంటి వివాదాలు ఆటలో భాగమని తాను సర్దుకుపోయానని, గంభీర్ మాత్రం దాని నుంచి బయటకు రాలేకపోయాడని తెలిపాడు. హర్భజన్‌, యువరాజ్‌, జహీర్‌ ఖాన్‌ తో తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని చెప్పాడు. అప్పట్లో తమ రెండు దేశాలు తరచు టోర్నీలు ఆడేవని, దీంతో తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, తాము ఒకరింటికి ఒకరం వెళ్లేవారమని, ఇప్పుడు తమకు వివాహాలు జరగడంతో ప్రాధామ్యాలు మారిపోయాయని చెప్పాడు. కోహ్లీకి  తాను ఇప్పుడు పెద్ద ఫ్యాన్ నని అఫ్రీది వెల్లడించాడు. టీమిండియాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ సందర్భంగా కోహ్లీ తనకు టీమిండియా ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని బహూకరించాడని...ఆ బహుమతిని ఎన్నటికీ మరువలేనని తెలిపాడు. 

More Telugu News