: రాకెట్లు, ఉపగ్రహాలే కాదు...ఇస్రో నుంచి సోలార్ కారు కూడా వస్తోంది!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కేవలం రాకెట్లు, ఉపగ్రహాల తయారీతోనే ఆగిపోలేదు. విరివిగా లభ్యమయ్యే వనరులను ఉపయోగించి, ప్రజలకు సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా సోలార్ కార్ల తయారీపై ఇస్రో దృష్టి సారించింది. అతి తక్కువ ధరకు సోలార్‌ కార్‌ ను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉంది. ఇప్పటికే సోలార్ కారును తయారు చేసి, వినియోగించిన ఇస్రో... దానిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తోంది.

తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ లో గత మార్చిలో సోలార్ కారును ఇస్రో తయారు చేసింది. అయితే దీనిని ఎక్కువ ధరకు కాకుండా సాధారణ ధరకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కారు తయారీలో లిథియం బ్యాటరీలు.. వాటి అనుసంధానం.. పెద్ద సవాల్‌ గా నిలిచాయని, చివరకు వాటిని అధిగమించామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. కారు పై భాగంలో సోలార్ ఫలకాలు ఏర్పాటు చేశామని, ఈ కారు నడిచేందుకు లిథియం బ్యాటరీలు పెద్ద ఎత్తున అవసరమవుతాయని వారు తెలిపారు.  

More Telugu News