: పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: చైనాకు ఉత్తర కొరియా వార్నింగ్

వ‌రుస‌గా అణు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తూ ప్ర‌పంచ దేశాల్లో భ‌యం నింపుతున్న ఉత్త‌ర‌కొరియాకు చైనా మంచి మిత్ర దేశ‌మ‌న్న విష‌యం తెలిసిందే. ఉత్త‌ర‌కొరియాలో చైనా త‌న‌ వ్యాపారాన్ని అధికంగానే విస్త‌రించుకుంది. అయితే, ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప‌రిస్థితుల దృష్ట్యా చైనా ఉత్త‌రకొరియాకు ఇటీవ‌లే వార్నింగ్ ఇచ్చింది. అణు కార్యక్రమాలను తక్షణమే రద్దు చేసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే, చైనా డిమాండ్ పై స్పందించిన ఉత్త‌ర‌కొరియా తిరిగి చైనాకే గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తమపై నిర్లక్ష్యపూరిత వ్యాఖ్యలు చేయ‌కూడ‌ద‌ని, త‌మ‌ సంకల్పాన్ని ఎవ్వరూ కదిలించలేరని పేర్కొంది. త‌మ సహనాన్ని ఇంకా పరీక్షిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చైనాను హెచ్చరించింది. అంతటితో ఆప‌కుండా చైనా తన రక్షణ కోసమే త‌మ దేశంతో కృతజ్ఞతతో ఉండాలని ఉత్తర కొరియా తన అధికారిక న్యూస్ ఏజెన్సీ ద్వారా ప‌లు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

More Telugu News