: మరో ఘనతకు శ్రీకారం... నేటి నుంచే జీఎస్ఎల్వీ-ఎఫ్‌ 09 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభం

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మరో ఘనతకు శ్రీకారం చుడుతోంది. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 09 ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం ప్రయోగం నిర్వహించనుండగా...నేటి మధ్యాహ్నం సరిగ్గా 1.57 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. కౌంట్ డౌన్ మొదలైన 27 గంటల తరువాత ప్రయోగం చేస్తారు. రాకెట్‌ అనుసంధానం, కౌంట్‌ డౌన్‌ ప్రక్రియ, వివిధ పరీక్షల నిర్వహణ, తదితరాలను విజయవంతం చేసేందుకు కల్పనా కాన్ఫరెన్సు హాలులో లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశం (ల్యాబ్‌) జరిగింది. సమావేశంలో రాకెట్‌ ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 09 కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ అయిన జీశాట్‌-9 ఉపగ్రహాన్ని జియో సింక్రనస్‌ కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఇప్పటికే ఇస్రోలోని అన్ని విభాగాల సంచాలకులు, సీనియర్‌ శాస్త్రవేత్తలు షార్‌ కు చేరుకుని రాకెట్‌ ప్రయోగంలో నిమగ్నమయ్యారు. 

More Telugu News