: త్వరలో అమెరికాపై అణుదాడి.. సిద్ధమవుతున్న ఉత్తర కొరియా?

అమెరికా, ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గినట్టు కనిపించడం లేదు. ఓ వైపు కిమ్ జాంగ్ ఉన్‌ను సరైన సమయంలో కలుసుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తే మరోవైపు కిమ్ మాత్రం యుద్ధానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలోనే అమెరికాపై అణుదాడికి కిమ్ సిద్ధంగా ఉన్నారని స్థానిక పత్రిక ఒకటి పేర్కొంది. అమెరికా భూభాగాలను సర్వ నాశనం చేసేందుకు ఉత్తరకొరియా ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉందంటూ కథనాన్ని ప్రచురించింది. జపాన్, దక్షిణ కొరియాలతో కలిసి అమెరికా మిలటరీ నిర్వహిస్తున్న డ్రిల్స్, యుద్ధ సన్నాహాలే దీనికి కారణమని పత్రిక వివరించింది. ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితులు అమెరికా డ్రిల్స్‌తో మరింత ఉద్రిక్తంగా మారినట్టు పేర్కొంది. యుద్ధమనేదే వస్తే అమెరికాను నాశనం చేయగల సాంకేతికత ఉత్తర కొరియా వద్ద ఉందని, కాబట్టి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More Telugu News