: యూరప్ పై ఉగ్ర దాడులకు అవకాశం... అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక

యూరప్ పై ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరగవచ్చని, ఆ దేశాలకు వెళ్లే అమెరికన్లు జాగ్రత్తగా ఉండాలని యూఎస్ సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. యూరప్ ఖండమంతటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు యూఎస్ స్టేట్ డిపార్ట్ మెంట్ ఓ ట్రావెల్ అలర్ట్ ను జారీ చేస్తూ, ఫ్రాన్స్, రష్యా, స్వీడన్, యూకే లపై ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఉగ్రవాదులు కన్నేసి ఉంచారని, భారీ ఎత్తున విరుచుకుపడవచ్చని పేర్కొంది.

శీతాకాల హాలిడే సీజన్ లో యూరప్ పర్యటనకు వెళ్లేవారికి చేసిన హెచ్చరికలు ఫిబ్రవరితో ముగిసిన నేపథ్యంలో, ట్రంప్ ప్రభుత్వం ఈ తాజా అలర్ట్ ను విడుదల చేసినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 1 వరకూ తాజా హెచ్చరికలు అమలులో ఉంటాయి. మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, ప్రార్థనా మందిరాలు, పార్కులు, ఎయిర్ పోర్టులు తదితర ప్రాంతాల్లో దాడులకు అవకాశముందని అధికారులు తమ ప్రకటనలో వెల్లడించారు.

More Telugu News