: మారుమూల అనాథాశ్రమాన్ని వెతుక్కుంటూ వెళ్లిన ఫేస్ బుక్ అధినేత...ఆశ్చర్యపోయిన కుటుంబం

ఫేస్ బుక్ సీఈవో మార్గ్ జుక‌ర్ బ‌ర్గ్ అమెరికాలో మారుమూల ప్రాంతంలో ఉన్న కుటుంబాన్ని వెతుక్కుంటూ వెళ్లి వారిని ఆనందాశ్చర్యాల్లో ముంచిన ఘటన చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకి వెళ్తే...అమెరికాలోని ఓహియో స్టేట్ లోని మారుమూల ప్రాంతంలో డానియల్ మూరే అనే వ్యక్తి తన కుటుంబ సభ్యుల సహకారంతో ఒక అనాథాశ్రమం నిర్వహిస్తున్నాడు. సాధారణంగా అనాథాశ్రమాలు పట్టణాల్లో ఉంటాయి. అయితే మూరే నిస్వార్థ సేవ గురించి తెలుసుకున్న జుకెర్ బర్గ్ ఆయన నివాసాన్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ... తన పేరు మార్క్ జుకెర్ బర్గ్ అని, ఫేస్ బుక్ సీఈవోనని పరిచయం చేసుకున్నారు.

అంతే కాకుండా ఆ రాత్రి వారి ఇంట్లోనే వారితో కలసి భోజ‌నం చేశారు. అనంతరం ఆయన నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి సహాయం చేస్తానని తెలిపారు. దీంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. కోట్లాది రూపాయలకు అధిపతి అయిన ఆయన తమను వెతుక్కుంటూ వచ్చి సహాయం చేస్తానని చెప్పండం పట్ల ఆ కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

More Telugu News