: విచ్చలవిడితనానికి నిదర్శనం...అమెరికా విమానాశ్రయాలు 'పడక'గదులుగా మారుతున్నాయి

పాశ్చాత్యదేశాల్లో జీవనశైలి కాస్త విచ్చలవిడిగా ఉంటుందన్న వాస్తవం అందరికీ తెలిసిందే. అమెరికాలో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కాస్త ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక షాపింగ్ వెబ్ సైట్ యూఎస్.జెట్ కోస్ట్.కామ్ వెబ్ సైట్ ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వే కోసం 18 ఏళ్లకు పైబడిన 4,915 మంది అమెరికా విమాన ప్రయాణికులను ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ సర్వేలో అమెరికా విమానాశ్రయాలు పడకగదులుగా మారుతున్నాయన్న అంశం వెలుగు చూసింది. ప్రతి పదిమందిలో ఒకరు అమెరికా విమానాశ్రయాల్లో శృంగారంలో పాల్గొంటున్నారని ఈ సర్వేలో తేలింది.

ఇలా శృంగారంలో పాల్గొంటున్న వారిలో 42% మంది పబ్లిక్ రెస్ట్ రూముల్లోనూ, 28% మంది స్టోరేజ్ కప్ బోర్డ్స్ దగ్గర, మరో 14% మంది వీఐపీ లాంజ్ లో శృంగారంలో పాల్గొంటున్నారని తేలింది. ఇందులో 17 శాతం మంది విమాన సిబ్బందికి శృంగారంలో ఉండగా పట్టుబడుతున్నారని ఈ సర్వేలో తేలింది. ఇలా శృంగారంలో పాల్గొనే వారిలో 87% మంది తమ పార్ట్స్ నర్స్ తో సరససల్లాపాల్లో తేలియాడుతుండగా, కేవలం 5 % మంది మాత్రం తమకు ఏమాత్రం పరిచయం లేని వారితో శృంగారంలో పాల్గొంటున్నారని ఈ సర్వే చెప్పింది. 

More Telugu News