: చాంపియన్స్ ట్రోఫీని బహిష్కరించే ఆలోచనలో భారత్!

ప్రపంచంలోనే అత్యధిక క్రికెట్ ఫ్యాన్స్, ఆదాయం ఉన్న బీసీసీఐ మాట ఐసీసీలో నెగ్గని వేళ, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఆదాయ పంపిణీ విధానంలో 'బిగ్ 3'కి మద్దతు లభించక ఓడిపోయిన బీసీసీఐ, ఇప్పుడు తనముందున్న ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి ఐసీసీని ఒత్తిడిలోకి నెట్టాలని చూస్తోంది. అందులో భాగంగా ఐపీఎల్ తరువాత జరిగే చాంపియన్స్ ట్రోఫీని బహిష్కరించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

ఈ టోర్నీకి ఇంతవరకూ భారత జట్టును బీసీసీఐ ప్రకటించలేదన్న సంగతి తెలిసిందే. ఇక ఇండియా లేకుంటే, ట్రోఫీ కళతప్పడంతో పాటు, ఐసీసీ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. ఆపై ఐసీసీ నిర్వహించే టోర్నీలకు బీసీసీఐ మద్దతు పలకకుంటే, క్రికెట్ ఆడే దేశాలన్నీ నష్టపోతాయి. ఇప్పటివరకూ బీసీసీఐ నుంచి టోర్నీ బహిష్కరణపై ఎటువంటి అధికారిక సమాచారం రాకున్నా, తన మాటను నెగ్గించుకునే దిశగా అధికారులు ఏ చర్యలు తీసుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

More Telugu News