: పుచ్చకాయకు, పులికి లింక్ ఏమిటండీ బాబూ?: టీటీడీ నిర్ణయంపై తిరుమలలో భక్తుల విమర్శలు!

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలలో పుచ్చకాయల వాడకాన్ని నిషేధిస్తూ టీటీడీ ఇటీవల ప్రకటన చేసింది. దీంతో, భక్తులు, వ్యాపారుల నుంచి విమర్శలు తలెత్తుతున్నాయి. అసలే, మండిపోతున్న ఎండలు.. చల్లగా ఉండేందుకు, డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు కనీసం పుచ్చకాలు తినేందుకు కూడా అవకాశం లేకుండా పోయిందని తిరుమలలో భక్తులు వాపోతున్నారు. వేసవికాలం కావడంతో పుచ్చకాయ ముక్కలు కావాలంటూ చాలా మంది భక్తులు తమను అడుగుతున్నారని కొండపై వ్యాపారులు చెబుతున్నారు.

అసలు పుచ్చకాయలు తినకుండా కొండపై ఎందుకు బ్యాన్ విధించారో అర్థం కావట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, తిరుమల కొండపై పుచ్చకాయల నిషేధానికి గల కారణాన్ని ఇటీవల టీటీడీ అధికారులు చెప్పారు. పుచ్చకాయ ముక్కలు తిన్న తర్వాత మిగిలిన చెత్తను పక్కన పడేస్తామని, దాని కోసం జింకలు జనారణ్యంలోకి వస్తాయని, ఆ జింకల కోసం పులులు వస్తాయని.. దీంతో, పులుల బారిన ప్రజలు పడతారని, అందుకే, పుచ్చకాయలను కొండపై నిషేధించామని టీటీడీ పేర్కొంది. పుచ్చకాయకు, పులికి లింక్ పెట్టడం ఏం బాగోలేదని పలువురు భక్తులు విమర్శిస్తున్నారు.

More Telugu News