: కోహినూర్ ను తిరిగి తేవడం మా చేతుల్లో లేదు: సుప్రీంకోర్టు

సుమారు 200 డాలర్ల విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇండియాకు తీసుకురావడం తమ చేతుల్లో లేదని, ఆ దిశగా కేంద్రం చేస్తున్న దౌత్య ప్రయత్నాలను తాను పర్యవేక్షించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో కోర్టులు కల్పించుకోవాలని దాఖలైన రెండు పిటిషన్లపై చీఫ్ జస్టిస్ జేఎస్ కేహార్ నేతృత్వంలో విచారణ చేపట్టిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేయగా, వజ్రాన్ని తిరిగి తెచ్చేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నామని కేంద్రం పేర్కొంది. ఇదే విషయాన్ని గుర్తు చేసిన సుప్రీంకోర్టు పిటిషన్లను కొట్టి వేస్తున్నట్టు తెలిపింది.

కాగా, ఈస్ట్ ఇండియా కంపెనీకి పంజాబ్ పాలకుల నుంచి బహుమతిగా వెళ్లిన కోహినూరు వజ్రం, ఇప్పుడు బ్రిటన్ మ్యూజియంలో ఉన్న సంగతి తెలిసిందే. 2010లో అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు, కోహినూర్ పై మీడియా ప్రశ్నించగా, ఆ వజ్రాన్ని ఇస్తే, బ్రిటీష్ మ్యూజియం ఖాళీగా కనిపిస్తుందని నవ్వుతూ సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News