: ప్రైవేటు పాఠశాలలకు ఎదురుదెబ్బ... పుస్తకాలు, యూనిఫార్మ్స్ విక్రయించరాదన్న సీబీఎస్ఈ

పాఠశాలలు విద్యా బోధనలు చేసే కేంద్రాలే తప్ప, వాణిజ్యపరమైన కార్యకలాపాలు చేసే సెంటర్లు కాదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. స్కూళ్లలో యూనిఫారాలు విక్రయించడం, టెక్ట్స్ బుక్స్, ఇతర స్టేషనరీ సామాన్లను అమ్మడం తక్షణమే నిలిపివేయాలని సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా నడిచే పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ గుర్తింపు పొందిన 20 వేలకు పైగా పాఠశాలకు సూచనలు పంపుతూ, విద్యాకేంద్రాల్లో వ్యాపారం వద్దని ఆదేశించింది. సీబీఎస్ఈ లేదా ప్రభుత్వ రంగ ఎన్సీఈఆర్టీ సిఫార్సు చేయని పలు పుస్తకాలు కొనుగోలు చేయాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని, వీటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

More Telugu News