: వేలానికి క్రిస్ గేల్ 'రికార్డు' బ్యాట్‌!

వెస్టిండీస్ స్టార్ ఆట‌గాడు క్రిస్ గేల్ టీ20 మ్యాచుల్లో 10 వేల ప‌రుగులు చేసిన మొద‌టి ఆట‌గాడిగా రికార్డు సృష్టించిన విష‌యం తెలిసిందే. నిన్న గుజ‌రాత్ ల‌య‌న్స్ పై జ‌రిగిన మ్యాచులో మూడు ప‌రుగులు చేయ‌డంతో ఆయ‌న ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ మ్యాచులో ఆయ‌న‌... 38 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో విరుచుకు పడి మొత్తం 77 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ 10 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్న క్ర‌మంలో ఉప‌యోగించిన బ్యాట్‌ను జూన్ 6న ‘క్రిస్ గేల్ ఫౌండేషన్‌’ ప్రారంభం కాబోతున్న సందర్భంగా వేలం వేస్తున్నట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

More Telugu News