: మరోసారి బాదుడుకు సిద్ధమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

గత కొన్ని రోజులుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్న నిర్ణయాలు వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కస్టమర్లను బాదుతూ, డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ బ్యాంకు ముందుకు సాగుతోంది. తాజాగా ఎస్బీఐ మరో నిర్ణయం తీసుకుంది. రూ. 2వేల లోపు చెక్ పేమెంట్స్ పై ఎస్బీఐ కార్డ్ వడ్డనకు సిద్ధమైంది. భారీగా పెరుగుతున్న కార్డ్ చెక్ పేమెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ఛార్జీలను వసూలు చేయనున్నట్టు తెలిపింది. రూ. 2 వేల లోపు చెక్ లపై రూ. 100 ఛార్జ్ వసూలు చేస్తామని చెప్పింది. దీనికి తోడు నాన్ ఎస్బీఐ చెక్ లను ఎస్బీఐ బ్రాంచ్ లలో డిపాజిట్ చేసినా రూ. 100 ఛార్జి వసూలు చేయనుంది. 

More Telugu News