: మిత్రదేశాల సేవలకు మోదీ ప్రామిస్ చేసిన ఉప్రగహం రెడీ... ప్రయోగానికి ముహూర్తం ఖరారు

2014 నేపాల్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దక్షిణాది దేశాల కోసం ఒక ఉపగ్రహాన్ని పంపి, దాని సేవలను దక్షిణాది దేశాలన్నీ పొందేలా చూస్తామని ప్రామిస్ చేశారు. దానిని నెరవేర్చేందుకు ఇస్రోకు 235 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఇస్రో 'సార్క్ ఉపగ్రహ' రూపకల్పన చేసింది. దీని ద్వారా టీవీ, డీటీహెచ్‌, వీశాట్స్‌, టెలిఎడ్యుకేషన్‌, టెలిమెడిసిన్‌ సేవలు అందుకోనే వీలుంది.

అసలు ఈ ఉపగ్రహాన్ని గత ఏడాది డిసెంబరులో నింగిలోకి పంపాల్సి ఉంది. ఉపగ్రహ తయారీలో కొంత ఆలస్యం కావడంతో మే నెలలో పంపేందుకు సిద్ధం చేశారు. దీనికి జీఎస్ఎల్వీ-ఎఫ్09గా నామకరణం చేశారు. దీనిని మే 5న నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి సాయంత్రం 4:57 నిమిషాలకు ప్రయోగించాలని ముహూర్తం పెట్టారు. అన్నీ అనుకూలిస్తే సకాలంలో దానిని కక్ష్యలో ప్రవేశపెడతామని శాస్త్రవేత్తలు తెలిపారు. 

More Telugu News