: ఎన్ఈఎఫ్టీ క్లియరెన్స్ టైమ్ ను తగ్గించిన ఆర్బీఐ

ఎలక్ట్రానిక్ చెల్లింపుల విధానంలో మరింత పారదర్శకత, వేగం పెంచడం లక్ష్యంగా ఎన్ఈఎఫ్టీ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్) విధానంలో డబ్బు బట్వాడా సమయాన్ని తగ్గిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇప్పటివరకూ ఎన్ఈఎఫ్టీకి గంటగా ఉన్న క్లియరెన్స్ సమయాన్ని అర గంటకు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఇదే సమయంలో ఉదయం 8:30 నుంచి గంటకోసారి చొప్పున 11 అదనపు సెటిల్ మెంట్ బ్యాచ్ లను ప్రవేశపెడుతున్నామని కొత్తగా ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా నియమితులైన బీపీ కనుంగో తెలిపారు. ఇకపై ఉదయం 8 గంటలకు తొలి బ్యాచ్ క్లియరెన్స్ ప్రారంభమవుతుందని, రాత్రి 7 గంటలకు చివరి బ్యాచ్ ఉంటుందని ఆయన తెలిపారు.

More Telugu News