: ముగిసిన రెండో రోజు ఆట... ఆకట్టుకున్న టీమిండియా బ్యాట్స్ మన్

హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్టులో రెండో ఆట ముగిసింది. కరుణ్ నాయర్ (5) మినహా టీమిండియా బ్యాట్స్ మన్ అంతా ఆకట్టుకోవడం విశేషం. రెండో రోజు పిచ్ కాస్త ఎక్కువ బౌన్స్ అయింది. దీంతో బ్యాట్స్ మన్ కు పరుగులు రాబట్టడం కష్టంగా మారింది. దీంతో ఓపెనర్లు మురళీ విజయ్ (11), కేఎల్ రాహుల్ (60) పరుగులు సాధించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో మురళీ విజయ్ ను హేజిల్ వుడ్ పెవిలియన్ కు పంపాడు. అనంతరం రాహుల్ కు ఛటేశ్వర్ పుజారా (57) జత కలిశాడు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతున్న దశలో అర్ధ సెంచరీతో సత్తా చాటిన రాహుల్ ను కుమ్మిన్స్ పెవిలియన్ కు పంపాడు. దీంతో పుజారాకు కెప్టెన్ అజింక్యా రహానే (46) జత కలిశాడు. వీరిద్దరూ రెండో సెషన్ ను సమర్ధవంతంగా పూర్తి చేశారు.

అర్ధ సెంచరీ సాధించిన పుజారాను లియాన్ బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే కరుణ్ నాయర్ ను, అనంతరం రహానేను, ఆ తరువాత రవి చంద్రన్ అశ్విన్ (30) ను వరుసగా పెవిలియన్ కు పంపి లియాన్ భారత్ కు షాకిచ్చాడు. ఈ క్రమంలో టీమిండియా 248 పరుగుల వద్ద రెండో ఆరోజు ఆట ముగించింది. పిచ్ పై అదనపు బౌన్స్ ను నాథన్ లియాన్ సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో నాలుగు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. క్రీజులో సాహా (10)కు జతగా రవిచంద్రన్ అశ్విన్ (16) ఉన్నాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో 52 పరుగులు వెనుకబడ్డ భారత జట్టు 91 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది. రేపటి మ్యాచ్ లో ఎవరు ఆధిక్యం ప్రదర్శిస్తే విజయం వారినే వరించే అవకాశం కనిపిస్తోంది. 

More Telugu News