: ఎయిర్ టెల్ ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్... మా వద్ద ఆధారాలున్నాయి: ఇంటర్నెట్ టెస్టింగ్ సంస్థ ఊక్లా

తమదే అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ అని ఎయిర్ టెల్ సంస్థ ప్రచారం చేసుకుంటూ ఉండటాన్ని రిలయన్స్ జియో తప్పుబట్టిన వేళ, ఇంటర్నెట్ పనితీరు టెస్టింగ్ సంస్థ ఊక్లా స్పందించింది. తాము గత సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికాల్లో సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక ఇచ్చామని, తమ ర్యాంకులు సరైనవేనని ప్రకటించింది. తమ ఫలితాలకే తాము కట్టుబడి వున్నామని ప్రకటించింది. ఇండియాలో ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ గా ఎయిర్ టెల్ నిలిచిందని ఊక్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెమ్మీ స్టీవెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా, తమ ఫలితాలతో ఓక్లా ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ఆరోపిస్తూ, ఏఎస్సీఐ (అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)కు రిలయన్స్ జియో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఊక్లాపై తాము చట్టపరమైన చర్యలకు దిగనున్నామని జియో ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, వాస్తవానికి గత సంవత్సరం మూడవ త్రైమాసికం, అంటే జూలై నుంచి సెప్టెంబర్ మధ్య రిలయన్స్ జియో మార్కెట్లో లేనే లేదు. ఆ తరువాతనే జియో మార్కెట్లోకి వచ్చింది.

More Telugu News