: ఉత్తరప్రదేశ్ లో అంతే... పరీక్షలు ఇలాగే రాస్తారు!

మాస్ కాపీయింగ్ అంటే ఎలా ఉంటుందో గతంలో బీహారీలు రుచిచూపితే... తాజాగా ఉత్తరప్రదేశ్ లో మాస్ కాపీయింగ్ కు పరాకాష్ఠగా నిలిచిన ఘటన చోటుచేసుకుంది. యూపీలో పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. నేడు గణిత పరీక్ష జరిగింది. ఈ పరీక్షను బల్లియా ప్రాంతంలోని ఓ స్కూల్లో విద్యార్థులు ఎలా రాశారో తెలుసా? సాధారణంగా పరీక్ష అంటే బెంచ్ లపై లేదా నేలపై దూర దూరంగా కూర్చుని పరీక్షలు రాస్తారు. విద్యార్థులు ఎలాంటి మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా ఇన్విజిలేటర్లు నిఘా పెడతారు.

అయితే అక్కడ మాత్రం విద్యార్థులు ఏదో వేడుకలో మిఠాయిలు పంచుకునేందుకు గుమిగూడినట్టు మూకుమ్మడిగా ఒక చోట చేరిపోయారు. పుస్తకాలు చూస్తూ రాసుకున్నారు. డిస్కస్ చేసుకుంటూ ఒకరు రాసిన జవాబును మరొకరు తీసుకుంటూ, ఆన్సర్లు డిక్టేట్ చేసుకుంటూ పరీక్షను రాశారు. ఇంకొందరు స్లిప్పులు తీసుకెళ్తూ మీడియా కంటబడ్డారు. భావిభారత పౌరుల విద్యను చూసి మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. 

More Telugu News