: డ్రాగా ముగిసిన మూడో టెస్టు... ఆకట్టుకున్న టీమిండియా, ఆస్ట్రేలియా!

జార్ఖండ్ లోని రాంచీ వేదిగా ముగిసిన మూడో టెస్టులో టీమిండియా, ఆసీస్ జట్లు ఆకట్టుకున్నాయి. బోర్డర్ అండ్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. భారత బౌలర్ల బంతులను సమర్థవంతంగా అడ్డుకున్న ఆసీస్ బ్యాట్స్ మన్ డ్రాగా ముగించారు. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయిన ఆసీస్ జట్టును షాన్ మార్ష్ (53), హ్యాండ్స్ కోంబ్ (72) అర్థసెంచరీలతో ఆదుకున్నారు.

అనంతరం నిప్పులు చెరిగే బంతులతో భారత బౌలర్లు, కట్టుదిట్టమైన ఫీల్డింగ్ తో భారత ఆటగాళ్లు ఆసీస్ ఆటగాళ్లను అవుట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికీ ఆసీస్ ఆటగాళ్లు భారత బౌలర్లను సమర్థవంతంగా అడ్డుకోవడంతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ఈ సిరీస్ లో చెరొక విజయం సాధించిన రెండు జట్లు పాయింట్ల పట్టికలో సమఉజ్జీలుగా నిలవగా, మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ పై అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శించిన భారత జట్టు నైతికంగా ఆత్మస్థైర్యం పుంజుకుని నాలుగో టెస్టుకు సిద్ధమవుతోంది. చివరిదైన నాలుగో టెస్టు ధర్మశాలలో జరగనుంది. 

More Telugu News