: గుండ్రని రన్‌వే.. మారనున్న విమానయాన రూపురేఖలు!

భవిష్యత్ విమానయాన చిత్రం మారిపోనుంది. విమానాశ్రయాల్లో కనిపించే పొడవాటి రన్‌వేలకు బదులు భవిష్యత్తులో గుండ్రని రన్‌వేలు దర్శనమివ్వనున్నాయి. ఇటువంటి రన్ వేల వల్ల బోలెడన్ని లాభాలు ఉన్నాయని నెదర్లాండ్స్ ఏరోస్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ‘ఇండికార్ సర్క్యూట్’గా పిలిచే ఇందులో ఒకేసారి మూడు విమానాలు ల్యాండ్ అయ్యే వీలుండడంతోపాటు స్థలం, ఇంధనం కూడా ఆదా అవుతాయని చెబుతున్నారు. అంతేకాదు ఒకేసారి మూడు విమానాలు టేకాఫ్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు. అతి తక్కువ స్థలంలోనే అంటే 3.5 కిలోమీటర్ల పొడవులోనే ఈ రన్ వేను నిర్మించవచ్చు. గాలి దిశతో సంబంధం లేకుండా విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేసే అవకాశం ఉంటుందని నెదర్లాండ్స్ ఏరోస్పేస్ సెంటర్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

More Telugu News