: మహా అద్భుతం.. 32 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన మొక్కకు ప్రాణం పోశారు!

రష్యా శాస్త్రవేత్తలు మహా అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఎప్పుడో 32 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఓ మొక్కకు మళ్లీ ప్రాణం పోశారు. ఈ మొక్క పేరు సైలిన్ స్టెలోఫిల్లా. సైబీరియాలో ఉన్న 'ది ఇన్స్ స్టిట్యూట్ ఆఫ్ సెల్ బయోఫిజిక్స్' కు చెందిన శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధనల కోసం కోలైమా నదీ పరీవాహక ప్రాంతంలో చనిపోయిన జీవుల జన్యువుల కోసం అన్వేషిస్తుండగా... నదికి దగ్గర్లోని ఓ ప్రాంతంలో మంచు దిబ్బల కింద ఓ ఉడుత తన ఆహారం కోసం దాచుకున్న ఓ గింజ కనపడింది.

ఈ గింజను ల్యాబ్ కు తీసుకెళ్లి పరిశోధనలు జరపగా... అది 32 వేల ఏళ్ల కింద జీవించిన సైలిన్ స్టెలోఫిల్లా అనే గడ్డి మొక్కకు చెందిన గింజగా గుర్తించారు. ఈ మొక్క ఇప్పటికీ ఉన్నప్పటికీ... దాని జన్యువుల్లో భారీగా మార్పులు వచ్చాయి. దీంతో, వేలాది ఏళ్ల క్రితం అంతరించిపోయిన ఈ మొక్కకు మళ్లీ ప్రాణం పోయాలని శాస్త్రవేత్తలు కృషి చేశారు. చివరకు విజయం సాధించారు. ఆ మొక్కకు మళ్లీ ప్రాణం పోశారు. రష్యా శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయం... ఇప్పుడు అనేక మంది శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిస్తోంది. అంతరించిపోయిన జంతువుల జన్యువులతో వాటికి మళ్లీ ప్రాణం పోయాలనే ఆశలకు జీవం పోస్తోంది.

More Telugu News