: తగ్గిన బంగారం ధరలు!

అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం, స్థానిక వ్యాపారుల నుంచి గిరాకీ లేకపోవడంతో పసిడి ధరలు తగ్గాయి. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.29 వేల దిగువకు పడిపోయింది. పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.28,900కు దిగువకు చేరింది. అదే సమయంలో, వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ. 41 వేల దిగువకు చేరింది. కిలో వెండి ధర రూ. 180 తగ్గడంతో రూ.40,800కు చేరింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. సింగపూర్ మార్కెట్లో ఔన్స్ ధర 0.22 శాతం తగ్గి, 1,201.10 డాలర్లకు, ఔన్సు వెండి ధర 0.35 శాతం తగ్గి 16.89 డాలర్లకు చేరింది.

More Telugu News