: రూ. 1000కి 4జీ ఫోన్: రిలయన్స్ జియో

చైనాలోని ఫోన్ విడిభాగాల సంస్థలు, లావా ఇంటర్నేషనల్ తో చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా, 4జీ నెట్ వర్క్ పై పనిచేసే వీఓఎల్టీయీ ఫీచర్ ఫోన్లను అతి తక్కువ ధరకు విక్రయించే ఆలోచనలో ఉన్నట్టు రిలయన్స్ జియో పేర్కొంది. వీటి ఖరీదు 15 డాలర్లుగా (సుమారు రూ. 1000) ఉంటుందని తెలిపింది. విడిభాగాల కోసం చైనా సంస్థలైన జడ్టీఈ, సీకే టెలికాం, వింగ్ టెక్, టిన్నో మొబైల్ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నామని, ఈ ఫోన్లను అపరిమిత వాయిస్, వీడియో కాలింగ్ ఆప్షన్లు, డిజిటల్ కంటెంట్ తో సహా బండిల్డ్ ఆఫర్ కింద విక్రయిస్తామని సంస్థ ప్రతినిధి ఒకరు ఎకనామిక్ టైమ్స్ పత్రికకు తెలిపారు. ఇదే సమయంలో గూగుల్ సంస్థ సైతం రిలయన్స్ జియో కోసం ఓ చౌక స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ ఆధారిత ప్లాట్ ఫాంపై పనిచేసే ఈ ఫోన్ కూడా జియో నెట్ వర్క్ పై బండిల్డ్ ఆఫర్ తో రానుంది. ఈ మేరకు ఇరు కంపెనీలూ కలసి పని చేస్తున్నాయని, ఈ సంవత్సరమే ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వస్తుందని సమాచారం.

More Telugu News