: హోలీ రోజు ఆ ఊరి మగాళ్లు ఆడాళ్లయిపోతారు!

రంగుల పండుగ హోలీ వచ్చిందంటే చాలు.. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని కర్ణాటక సరిహద్దు గ్రామమైన సంతెకూడ్లూరులో పురుషులు ఆడవారిగా మారిపోతారు. అయితే నిజంగానే మహిళలుగా మారిపోవడం కాదు.. చీరకట్టి ఆడాళ్లలా సింగారించుకుంటారు. నగలు ధరిస్తారు. పూలబుట్టలు పట్టుకుని, పిండి వంటల నైవేద్యాలతో గ్రామంలోని రతీ మన్మథ ఆలయానికి వెళ్లి పూజలు చేస్తారు. కోరిన కోర్కెలు తీరిన మగవాళ్లు ఇలా రతీమన్మథులకు పూజలు చేయడం ఆ ఊళ్లో తాతలకాలం నుంచి వస్తున్న ఆచారం. ఆదివారం హోలీని పురస్కరించుకుని కోర్కెలు తీరిన పురుషులు చీరలు కట్టుకుని ఆలయానికి చేరుకున్నారు. స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కోర్కెలు తీరిన వారు ఎవరైనా సరే, ఎంతటి హోదాలో ఉన్నా చీరకట్టుకోవాల్సిందే. ఉత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం రతీమన్మథులకు ఘనంగా మహా రథోత్సవం నిర్వహించారు.

More Telugu News