: కొత్త ఫీచర్స్ జనానికి నచ్చలేదట... మళ్లీ ఓల్డ్ వెర్షనే తెస్తున్న వాట్స్ యాప్!

వాట్స్ యాప్ లేటెస్ట్ ఫీచర్స్ వినియోగదారులను అంతగా ఆకట్టుకోలేదు. నూతన ఆప్షన్స్ తో సరికొత్తగా రూపుమార్చుకున్న వాట్స్ యాప్ కు వినియోగదారుల నుంచి ఊహించిన స్పందన రాలేదు. దీంతో పునరాలోచనలో పడ్డ వాట్స్ యాప్ గతంలో ఉన్న టెక్స్ట్ బేస్‌డ్ ఫీచర్‌ కే తిరిగి మారుతున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రొఫైల్ స్టేటస్ లో ఫొటోతో పాటు తమ గురించి తెలిపే ఇంట్రడక్షన్ రూపంలో చిన్న టెక్స్ట్ రాసుకునేందుకు వీలుండేది. దీని స్థానంలో సరికొత్త స్టేటస్ ఫీచర్‌ పేరుతో ఫొటోతో పాటు చిన్నపాటి వీడియో కూడా స్టేటస్‌ గా పెట్టుకునేలా ఆప్షన్ తెచ్చారు.

ఈ ఫీచర్ పెట్టిన తరువాత వాట్స్ యాప్ లో వచ్చే మెసేజ్ లు 24 గంటల తరువాత రికార్డ్స్ లో కనిపించడం లేదు. ఆటోమేటిక్ గా స్టేటస్ మెసేజ్ లు కనిపించకుండా మాయమవుతున్నాయి. దీంతో కొత్త ఫీచర్ బాగోలేదంటూ వినియోగదారులు పెదవి విరిచారు. దీంతో ఈ ఆప్షన్ స్థానంలో గతంలో ఉన్న టెక్స్ట్ బేస్డ్ ఫీచర్ నే తిరిగి ప్రవేశపెట్టనున్నామని వాట్స్ యాప్ తెలిపింది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ బీటా వర్షన్‌ యూజర్లకు పాత స్టేటస్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని చెప్పిన వాట్స్ యాప్, త్వరలోనే మిగిలిన ఓఎస్ వర్షన్ లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.

More Telugu News