: చంద్రుడిపై ‘అమెజాన్’ కన్ను.. డెలివరీ సర్వీసుకి ప్రణాళికలు!

ప్రముఖ ఈ - కామర్స్ సంస్థ ‘అమెజాన్’ దృష్టి భూమికి ఉపగ్రహం అయిన చంద్రుడిపై పడింది. చంద్రుడిపై ఎప్పటికైనా మనుషులు ఆవాసాలు ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయని.. అందుకే,  తమ సంస్థ డెలివరీ సర్వీసులను అక్కడికి కూడా విస్తరించాలని అమెజాన్ సీఈవో బెజోసి భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి ‘బ్లూ ఒరిజిన్’ అనే యూరో స్పేస్ సంస్థ ఒకటి ఆయనకు ఉంది. అమెజాన్, బ్లూ ఒరిజిన్ సంస్థలను రెండింటిని కలిపి చంద్రుడిపై డెలివరీ సర్వీసును అందుబాటులోకి తేవాలని ఆయన భావిస్తున్నారట.

ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వస్తువులు, ఇతర సామగ్రి సహా మనుషులకు ఉపయోగపడే వస్తువులను చంద్రుడి పైకి తీసుకువెళ్లేందుకు వీలుగా ఓ ప్రత్యేక రాకెట్ ను తయారు చేస్తారట. ఈ రాకెట్ 4500 కిలోల బరువును మోసుకు వెళ్లేలా తయారు చేస్తారట. చంద్రుడు పైకి మనుషులనే తీసుకువెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెస్తారని, ఈ లక్ష్యాన్ని మరో మూడేళ్లలో సాధించాలని చూస్తున్నారట. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక బృందానికి అమెజాన్ సంస్థ ఓ లేఖ కూడా రాసినట్టు తెలుస్తోంది. 

More Telugu News