: 2050 కల్లా ముస్లిం జనాభాలో భారత్ నెంబర్ వన్!

మరో 30 ఏళ్లలో ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరించబోతోంది. 2050  నాటికి దేశంలో వారి సంఖ్య 30 కోట్లు దాటిపోతుందని అమెరికా మేధో పరిశోధనా సంస్థ ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ పేర్కొంది. ప్రస్తుతం ముస్లింల పెరుగుదల రేటును బట్టి చూస్తే ఈ శతాబ్దాంతానికి ముస్లింల సంఖ్య క్రైస్తవుల సంఖ్యను అధిగమిస్తుందని తెలిపింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం ప్రపంచంలో క్రైస్తవం అతిపెద్ద మతం కాగా రెండో స్థానంలో ఇస్లాం ఉంది. ఇక ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా ఇండోనేషియా కొనసాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా 73 శాతం మేర పెరిగి 2050 నాటికి 280 కోట్లకు చేరుకుంటుందని రీసెర్చ్ సెంటర్ అంచనా వేసింది. ప్రపంచ జనాభా పెరుగుదల రేటుకు రెట్టింపు వేగంతో ముస్లిం జనాభా పెరుగుతున్నట్టు అధ్యయనం వెల్లడించింది. ఇక ముస్లింలలో 62 శాతంమంది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ఉంటున్నట్టు రీసెర్చ్ సెంటర్ పేర్కొంది.

More Telugu News