: మరో ఘనత సాధించిన ‘భారతీ ఎయిర్ టెల్’ !

ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్ టెల్ 2016 లో అత్యంత వేగవంతమైన మొబైల్ నెట్ వర్క్ గా నిలిచింది. ఈ విషయం బ్రాడ్ బ్యాండ్ టెస్టింగ్, నెట్ వర్క్ విశ్లేషణ అప్లికేషన్ సంస్థ ఓక్లా వెల్లడించింది. ఓక్లా కు చెందిన స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా దేశంలోని మొబైల్ వినియోగదారులపై ఆధునిక పరికరాలతో మిలియన్ల సంఖ్యలో స్పీడ్ టెస్టులు నిర్వహించి ఒక నివేదికను తయారు చేశారు.

ఈ సందర్భంగా భారతీ ఎయిర్ టెల్ భారత్, దక్షిణాసియా ఆపరేషన్స్ డైరెక్టర్ అజయ్ పూరి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి సంస్థ ఓక్లా నుంచి ఎయిర్ టెల్ కు గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందని, ప్రపంచ స్థాయి నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్న తరుణంలో ఈ గుర్తింపు లభించడం మరింత ఆనందంగా వుందని అన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకే తాము ప్రయత్నిస్తుంటామని చెప్పారు. కాగా, దేశంలోని అత్యధిక వినియోగదారులు ‘భారతీ ఎయిర్ టెల్’ కు ఉన్నారు. తాజాగా, ఓక్లా చేసిన ప్రకటనతో ఈ సంస్థ మరో ఘనత సాధించినట్టయింది.

More Telugu News