: గ్లోబల్ బ్రాండ్స్ హోదాను కోల్పోయిన టాటా

ఇటీవలి కాలంలో టాటా కంపెనీల్లో నెలకొన్న వివాదాల ప్రభావం టాటా గ్రూప్ బ్రాండ్ విలువను కుంగదీశాయి. 'బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500' తాజా నివేదిక ప్రకారం, టాటా గ్రూప్ నకు టాప్-100లో స్థానం దక్కలేదు. గత సంవత్సరం బ్రాండ్స్ జాబితాలో 82వ స్థానంలో ఉన్న టాటా గ్రూప్, ఈ ఏడు 103వ స్థానానికి జారిపోయింది. వాస్తవానికి బ్రాండ్ ఫైనాన్స్ వెల్లడించే టాప్ -100 కంపెనీల్లో భారత తరఫున నిలుస్తూ వచ్చింది టాటా గ్రూప్ మాత్రమే. ఇప్పుడా సంస్థకు కూడా స్థానం లభించలేదు.

గత సంవత్సరం అక్టోబర్ 24న గ్రూప్ సంస్థల చైర్మన్ సైరస్ మిస్త్రీని తొలగించడంతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతుండగా, గ్రూప్ సంస్థల విలువ 13.68 బిలియన్ డాలర్ల నుంచి 13.11 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక టాప్-500లో స్థానం సంపాదించుకున్న భారత కంపెనీల్లో ఎయిర్ టెల్ (190), ఎల్ఐసీ (222), ఇన్ఫోసిస్ (251) తదితర కంపెనీలున్నాయి. యాపిల్ సంస్థ మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ బ్రాండ్ గా నిలువగా, గూగుల్ రెండో స్థానంలో ఉందని బ్రాండ్ ఫైనాన్స్ తెలిపింది. ఆపై అమెజాన్, ఫేస్ బుక్ అలీబాబా నిలిచాయి.

More Telugu News