: ట్రంప్ మనసు మార్చేందుకు కదులుతున్న భారత ఐటీ పెద్దలు

అమెరికా ప్రభుత్వ ఇమిగ్రేషన్ విధానం ఇబ్బందులు పెడుతున్న వేళ, ట్రంప్ ను కలిసి సమస్యను పరిష్కరించుకునే దిశగా ఐటీ దిగ్గజ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ లు ఈ నెల 20న వాషింగ్టన్ వెళ్లనున్నట్టు ప్రకటించారు. 150 బిలియన్ డాలర్ల విలువైన భారత ఐటీ ఇండస్ట్రీ నష్టపోకుండా చూసేందుకు అమెరికా వెళ్లి లాబీయింగ్ చేయాలని నిర్ణయించినట్టు నాస్కామ్ చైర్మన్ ఆర్ చంద్రశేఖరన్ తెలిపారు. ఐటీ కంపెనీల సీఈఓలు ట్రంప్ ను కలవనున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, హెచ్-1బీ వీసా పొందాలంటే ఇంతవరకూ కనీస వేతనం 60 వేల డాలర్లు కాగా, ఇప్పుడు దాన్ని 1.30 లక్షల డాలర్లకు పెంచిన సంగతి తెలిసిందే. అంత వేతనాలు ఇవ్వాలంటే, ఐటీ కంపెనీలు కలవరపడుతున్నాయి. తమపై భారం పెరుగుతుందని, దీంతో నష్టపోతామన్నది ఐటీ కంపెనీల వాదన.

More Telugu News