: ఈ బైక్‌కి మూడు చ‌క్రాలు.. ఫీచర్స్ అదుర్స్!

అమెరికాలోని వెస్ట్‌ వర్జీనియా ప్రాంతంలో ఉండే జెడ్‌ఈవీ అనే ఓ కంపెనీ విభిన్న రీతుల్లో మోటార్‌సైకిల్స్‌ను త‌యారు చేస్తూ అందరినీ ఆక‌ట్టుకుంటోంది. సాధార‌ణంగా మోటార్‌సైకిల్స్ ను ద్విచ‌క్ర వాహ‌నాలు అని పిలుస్తాం. కానీ, జెడ్ఈవీ త‌యారు చేస్తోన్న ఈ వాహ‌నాల‌ను మూడు చ‌క్రాల బండి అని పిలవాలి. ఎందుకంటే, ఈ మోటార్‌సైకిల్స్ కు మూడు చ‌క్రాలు వున్నాయి. ముందువైపున రెండు, వెనుకవైపు ఒక చక్రం ఉండే ఎల్‌ఆర్‌సీ – టీ 15ని సదరు కంపెనీ రూపొందించింది. ఈ మోటార్‌ బైక్‌ 15 కిలోవాట్ల బ్యాటరీలతో పనిచేస్తుంది. ఇందులో ఎన్నో ప్ర‌త్యేక‌తలు ఉన్నాయి. ఒకసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల‌దు. అంతేకాదు, గంటకు ఏకంగా 88 కిలోమీటర్ల వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌దు. ఎల్‌ఆర్‌సీ టీ–15 మోటార్‌.. బాడీలో కాకుండా చక్రంలోనే ఏర్పాటు చేశారు.

ఈ బైక్‌కి మూడు చక్రాలు ఉండటం వల్ల రోడ్డుపై అది చాలా స్థిరంగా ఉండడ‌మే కాకుండా వంపులు వచ్చినప్పుడు ముందువైపున ఉన్న రెండు చక్రాలు వంపునకు తగ్గట్టుగా పైకి కిందకు కదులుతాయి. దీని ధ‌ర విష‌యం స్ప‌ష్టంగా తెలియ‌రాలేదు. అయితే సుమారు 20 వేల డాలర్లు(రూ.14ల‌క్ష‌లు ) ఉంటుంద‌ని భావిస్తున్నారు.

More Telugu News