: నిశ్చితార్థం చీరపై తన ప్రేమకథను డిజైన్ చేయించుకున్న సమంత... మీరూ చూడండి!

అక్కినేని వారింటి కోడలుగా అడుగుబెట్టనున్న సమంత, నిన్న నాగచైతన్యతో జరిగిన నిశ్చితార్థానికి బంగారు రంగులో ఉన్న చీర కట్టుకుని హాజరైన సంగతి తెలిసిందే. ఈ చీర డిజైన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఈ చీరను సమంత కోరిక మేరకు ముంబై డిజైనర్ క్రేషా బజాజ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఇక ఈ చీరపై సమంత తన ప్రేమకథను డిజైన్ చేయించుకుంది. చీర అంచును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ చీరపై చైతూతో తన తొలి చిత్రం 'ఏమాయ చేశావే'లోని ఓ సన్నివేశం నుంచి అఖిల్ నిశ్చితార్థంలో దిగిన ఫ్యామిలీ ఫోటో వరకూ డిజైన్ చేయించుకుంది. ఇంకా దీనిపై ఓ బైక్ పై చైతన్యతో కలసి వెళుతున్న చిత్రం కూడా ఉంది. చైతన్యపై తనకెంత ప్రేమ ఉందో ఈ చీరను సమంత డిజైన్ చేయించుకున్న తీరే తెలుపుతోందని నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు.

More Telugu News