sharukh khan: త‌మ అభిమాన హీరోయిన్‌కి పెళ్లయిపోతే మనోళ్లు బాధపడతారు.. అక్కడ అలా కాదు: షారుఖ్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన రాయిస్ సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో పెళ్లి కాని అమ్మాయినే హీరోయిన్ గా తీసుకున్నామ‌ని తాజాగా ఓ మీడియాకు చెప్పిన షారుఖ్ ఖాన్‌..అందుకు కార‌ణాల‌ను వివ‌రించాడు. హాలీవుడ్ తో పోలిస్తే మనకు సెంటిమెంట్ ఎక్కువ అని చెప్పాడు. మన ఆడియన్స్ పెళ్లికాని హీరోయిన్స్ అంటేనే ఇష్ట‌ప‌డ‌తార‌ని హాలీవుడ్ లో ఏంజలీనా జోలీ, కెమెరాన్ డియాజ్ , జూలియా రాబర్ట్స్, రోసముంద్ పీక్ , కేట్ విన్స్ లెట్ తో పాటు ఎంతో మంది పెళ్లయిన వారే హీరోయిన్లుగా న‌టిస్తున్నార‌ని, వారిని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని అన్నారు.

హాలీవుడ్‌లో వివాహం అనంత‌రం పిల్లలకు తల్లులైన వాళ్లు కూడా హాట్ హీరోయిన్స్ గా ఉన్నార‌ని.. కానీ, ఇండియాలో హీరోయిన్ తో డ్రీమ్ వేసుకునే ప్రేక్ష‌కులు ఉన్నారని, ఒకవేళ త‌మ అభిమాన హీరోయిన్‌కి పెళ్లి అయిపోతే బాధపడతారని షారుఖ్ పేర్కొన్నాడు. అందుకే తన తాజా సినిమాలో కూడా పెళ్లి కాని అమ్మాయినే హీరోయిన్ గా తీసుకున్నానని చమత్కరించాడు.

More Telugu News