: పులిని ఆటాడుకుని ఓడించిన బాతు!

పులి వేటకు దిగిందంటే దాని కంటబడిన దానికి భూమిమీద నూకలు చెల్లినట్టే. అలాంటి పులిని ఓ బాతు ఆటాడుకుంది. వెంటాడి, వేటాడి అలిసిపోయిన పులి 'ఈ పూటకి ఇక పస్తే' అని భావించి వేట నుంచి విరమించుకున్న ఘటన ఆస్ట్రేలియాలోని ఓ జూలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆస్ట్రేలియాలోని సింబియో వైల్డ్ లైఫ్ పార్క్ లోని నీటి కొలనులో ఓ బాతు తన పని తాను చేసుకుంటోంది. దాహం తీర్చుకునేందుకు ఆ నీటి కొలనును సమీపించిన పులి, బాతును చూసింది. అంతే, వెంటనే వేటాడి తినెయ్యాలని భావించింది. నీటిలో స్వేచ్ఛగా ఈదే బాతును తినాలనుకోవడం ఆ పులికి అత్యాశే అయింది. దీంతో చాలా సేపు దాని వెంటపడ్డ పులి ఇక దానిని పట్టుకోవడం తన వల్ల కాదని భావించి తోకముడిచింది. పులి-బాతు వేటాట మీరు కూడా చూడండి.


More Telugu News