: ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ల భద్రత కోసం ‘ఫ్లిప్ కార్ట్’ యాప్

ప్రముఖ ఆన్ లైన్ సంస్థ ‘ఫ్లిప్ కార్ట్’కు చెందిన ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నంజుండ స్వామి ఫోన్ డెలివరీ చేసేందుకు వెళ్లి హత్యకు గురైన సంఘటన ఇటీవల బెంగళూరు నగరంలో జరిగింది. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని తమ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ల భద్రత కోసం ‘ఫ్లిప్ కార్ట్’ చర్యలు చేపట్టింది. ‘ప్రాజెక్టు నంజుండ’ పేరిట కొత్త యాప్ ను ఈరోజు ఆవిష్కరించింది.

ఈ సందర్భంగా సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నితిన్ సేథ్ మాట్లాడుతూ, విలువైన వస్తువులతో వినియోగదారుల వద్దకు వెళుతుండే తమ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లకు ఆపద సమయాల్లో అత్యవసర సాయం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త యాప్ ను ఆవిష్కరించినట్లు చెప్పారు. ఆపదలో ఉన్న ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లు ‘నంజుండ’ పేరిట ఏర్పాటు చేసిన ఎస్ వోఎస్ బటన్ ను ప్రెస్ చేయడం ద్వారా ఆ సమాచారం హబ్ ఇంఛార్జికి, స్థానికంగా ఉండే ఇతర ఎగ్జిక్యూటివ్ లకు చేరుతుందన్నారు. ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా చేరే ఈ సమాచారంతో  ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ లను రక్షించుకునే అవకాశం ఉంటుందని నితిన్ సేథ్ వివరించి చెప్పారు.

More Telugu News