Bipin Rawat: పాకిస్థాన్‌ మళ్లీ కాల్పులకు తెగబడితే త‌గిన బుద్ధి చెబుతాం: ఆర్మీ చీఫ్ హెచ్చ‌రిక‌

దేశం కోసం ప్రాణ‌ త్యాగం చేసిన జ‌వాన్ల‌కు ఆర్మీ డే సంద‌ర్భంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆ జ‌వానులు దేశం కోసం పోరాడిన తీరును ప్ర‌శంసించారు. భారత్‌ సరిహద్దు వెంట తాము శాంతిని కోరుకుంటున్నామని, అయితే కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్థాన్‌ మళ్లీ కాల్పులకు పాల్ప‌డితే మాత్రం తాము తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

జవాన్ల సమస్యల పరిష్కారం కోసం వారు ఫిర్యాదులు చేయ‌డానికి బాక్సులు ఏర్పాటు చేశామ‌ని బిపిన్ రావ‌త్ తెలిపారు. జ‌వాన్ల స‌మ‌స్య‌లను తెల‌ప‌డానికి త‌నను కూడా నేరుగా కలవవ‌చ్చని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సందర్భంగా దివంగత సైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప భార్యకు ఆయ‌న‌ గ్యాలంటరీ అవార్డు ప్ర‌దానం చేశారు.

More Telugu News