: నా పర్సులో ఒక్క పైసా కూడా ఉంచుకోను: ‘ఇన్ఫోసిస్’ సీఈవో విశాల్ సిక్కా

తన పర్సులో ఒక్క పైసా కూడా ఉంచుకోనని, తాను క్యాష్ లెస్ అని చెబుతున్న ఆయన, దేశంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఉద్యోగుల్లో ఒకరు, ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్  సీఈఓ అయిన విశాల్ సిక్కా. ఇన్ఫోసిన్ సంస్థ గత ఏడాది అనుకున్న దాని కన్నా రూ.3,708 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. జనవరి నుంచి డిసెంబర్ 2016 నాటికి ‘ఇన్ఫోసిస్’ 10 బిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాన్ని ఛేదించిన విషయమై విశాల్ సిక్కా స్పందిస్తూ..‘ఇదో ఉద్విగ్న మైలురాయి’ అని అభివర్ణించారు.

కాగా, దేశంలో పెద్దనోట్ల రద్దుపై కూడా ఆయన మాట్లాడారు. దేశంలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం తాను నగదు మార్పిడి చేసినట్టు తనకు గుర్తులేదని, తన పర్సులో నగదు మాత్రం ఉండదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతో సాహసోపేతమైందని నలభై ఎనిమిది సంవత్సరాల విశాల్ అభిప్రాయపడ్డారు. అవినీతి నిర్మూలనకు దేశంలో కొత్త ఆవిష్కరణలకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని, తాను ఆశావాదినని, అన్నింటిలోనూ మంచినే చూస్తానని, డిజిటల్ భారత్ తో అంతా మంచే జరుగుతుందని ఏడాదికి రూ.48 కోట్లకు పైగా జీతం అందుకునే విశాల్ సిక్కా అభిప్రాయపడ్డారు.

More Telugu News