ap7am logo

బంప‌ర్ ఆఫ‌ర్లను ప్రకటించిన ఫ్లిప్కార్ట్.. వివరాలు ఇవిగో!

Wed, Jan 11, 2017, 01:17 PM
ప్ర‌ముఖ‌ ఈ-కామర్స్ సంస్థ‌ ఫ్లిప్కార్ట్ తన వినియోగ‌దారుల ముందు బంప‌ర్ ఆఫ‌ర్లను ఉంచింది. ఆపిల్ ఫెస్ట్ పేరుతో ఈనెల‌ 10 నుంచి 13 వరకు ఐఫోన్లపై భారీ ఆఫ‌ర్లు ఇస్తున్న‌ట్లు పేర్కొంది. వాటితో పాటు ఆపిల్ యాక్ససరీస్పై కూడా ఈ ఆఫ‌ర్లు ఉంటాయ‌ని, అంతేగాక‌ ఐఫోన్ 6 కొనుక్కునే వారికి అన్ని డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం రాయితీ కూడా ఇస్తున్న‌ట్లు తెలిపింది.

ఈ ఆఫ‌ర్ ప్రకారం ఆపిల్ ఐఫోన్ 7(128జీబీ) జెట్ బ్లాక్ 7 శాతం రాయితీలో రూ.65 వేలకే ల‌భిస్తోంది. అంతేగాక‌, ఎలాంటి చార్జీలు లేని ఈఎంఐ ప్లాన్ నెలకు రూ.5,147 చొప్పున చెల్లించుకునే వెసులుబాటును క‌ల్పించింది. ఇక‌ రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ.3,152 చెల్లించాలి. వాటితో పాటు ఎక్స్చేంజ్పై రూ.5000 డిస్కౌంట్ తో పాటు అదనంగా ధరపై రూ.3000 తగ్గింపు ఉంటుంద‌ని ఆ కంపెనీ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. ఈ ఐఫోన్లకు ఎక్స్చేంజ్పై రూ.23వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. ఇదే ఆఫ‌ర్‌లో మ‌రో 5 శాతం డిస్కౌంట్‌ను యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది.

ఇక ఐఫోన్ 7(32జీబీ) రోజ్ గోల్డ్ ఫోన్ కు 7 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్‌ పేర్కొంది. దీని ప్ర‌కారం ఆ ఐఫోన్ రేటు రూ.55,000గా ఉంటుంద‌ని తెలిపింది. దీనికి ఈఎంఐ ఛార్జీలు ఉండ‌బోవ‌ని, ఎక్స్చేంజ్పై రూ.23వేల డిస్కౌంట్ తో పాటు అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుకి రూ.3,000 డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు తెలిపింది. దీనికి కూడా యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లు అదనంగా 5 శాతం రాయితీ  పొందవచ్చని పేర్కొంది. ఇక‌ 6 శాతం త‌క్కువ ధ‌ర‌తో ఐఫోన్7(256 జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ మోడల్ విక్ర‌యించ‌నున్న‌ట్లు, దీని ప్ర‌కారం దాని ధ‌ర‌ రూ.75,000 ఉంటుంద‌ని తెలిపింది. కాగా, 128 జీబీ ఆపిల్ ఐఫోన్ 7 రోజ్ గోల్డ్ వేరియంట్ రూ.65,000కు ల‌భించ‌నుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్ను త‌మ వినియోగదారులు రూ.82వేలకే పొంద‌చ్చ‌ని ఆ కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. అంతేగాక‌, దీనిపై రూ.23వేల వరకు ఎక్స్చేంజ్ రాయితీ ఉంటుంద‌ని తెలిపారు. రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై మరో రూ.3వేలు డిస్కౌంట్ ఇవ్వనున్నామ‌ని తెలిపారు. దీనికి కూడా యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డుదారులకి 5 శాతం అదనపు డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు చెప్పింది.ఈ రేట్ల ప్ర‌కారం ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) రోజ్ గోల్డ్ ఆప్షన్ను సైతం రూ.82వేలకే అందిస్తున్నట్లు, జెట్ బ్లాక్ రంగులో ఇతర వేరియంట్లు 258 జీబీ వేరియంట్ ధర రూ.92వేలుగా నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) జెట్ బ్లాక్ ఆప్షన్కు ఇచ్చిన ఆఫర్లనే ఈ ఫోన్కు ఫ్లిప్కార్ట్లోనూ పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు.
 
ఇంక‌ ఆపిల్ ఐఫోన్6(16జీబీ) స్పేస్ గ్రే వేరియంట్ ను త‌మ వెబ్‌సైట్ ద్వారా రూ.31,990కే అందిస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. దీని ఎక్స్చేంజ్పై రూ.24వేల వరకు రాయితీ ఉందని తెలిపింది. అంతేగాక‌ రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యూపై అద‌నం రూ.4,000 డిస్కౌంట్ను ఇస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ ఐఫోన్‌ ఈఎంఐ రూ.1,552 నుంచి అందుబాటులో ఉంచుతున్న‌ట్లు తెలిపింది. ఆపిల్ 6ఎస్(32జీబీ) స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్ కలర్స్ వేరియంట్లు త‌మ ఫ్లాట్‌పాం ద్వారా రూ.46,999కు ల‌భిస్తాయ‌ని తెలిపింది. ఎక్స్చేంజ్పై రూ.23వేల వరకు డిస్కౌంట్ ఉంటుంద‌ని తెలిపింది. దీనికి అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై రూ.3000 తగ్గింపు పొందవచ్చని పేర్కొంది. ఈ ఐఫోన్‌కు కూడా యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు యూజర్లయితే అదనంగా 5 శాతం రాయితీ పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది.
 
ఇక‌, ఆపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్ (32జీబీ) సిల్వర్, రోజ్ గోల్డ్ ఫోన్లకు కూడా భారీ డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు తెలిపింది. త‌మ వెబ్‌సైట్ ద్వారా ఈ ఐఫోన్ల‌ను రూ.56,999కు అందుబాటులో ఉన్నాయ‌ని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది.  దీనికిగానూ ఎక్స్చేంజ్పై రూ.23వేల డిస్కౌంట్ ఉంటుంద‌ని తెలిపింది. దీనికి అదనంగా రెగ్యులర్ ఎక్స్చేంజ్ వాల్యుపై మ‌రో రూ.3,000 రాయితీ ఇస్తున్న‌ట్లు తెలిపింది. యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కి అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు తెలిపింది.

 కాగా, ఆపిల్ ఐఫోన్ 5ఎస్ మోడల్ 16 జీబీ సిల్వర్, స్పేస్ గ్రే రంగు వేరియంట్ల‌కు కూడా తాము డిస్కౌంట్ ప్ర‌క‌టించామ‌ని ఫ్లిప్‌కార్ట్ ప్ర‌తినిధులు తెలిపారు. ఈ డిస్కౌంట్ తో రూ.19,999కే ఆ ఐఫోన్ ఇస్తున్నామ‌ని, ఎక్స్చేంజ్పై రూ.15వేల వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నామ‌ని పేర్కొన్నారు.  వాటితో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ యాక్ససరీస్, కీబోర్డులు, మౌస్ వంటి వాటిపై 50, 25 శాతం డిస్కౌంట్‌లు ఉంటాయ‌ని తెలిపారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Garudavega Banner Ad
Uttam Kumar Reddy on Konda couple joining Congress..
Uttam Kumar Reddy on Konda couple joining Congress
Konda Couple Joins Cong: Konda Surekha Press Meet- Delhi..
Konda Couple Joins Cong: Konda Surekha Press Meet- Delhi
Konda Couple Re joins Congress In Presence Of Rahul Gandhi..
Konda Couple Re joins Congress In Presence Of Rahul Gandhi
Debate: Chintamaneni responds on Pawan Warning..
Debate: Chintamaneni responds on Pawan Warning
CM Chandrababu Interaction in USA Tour - LIVE..
CM Chandrababu Interaction in USA Tour - LIVE
Nara Chandrababu Naidu biopic on the cards..
Nara Chandrababu Naidu biopic on the cards
TRS Corners Kodandaram over allying with TDP..
TRS Corners Kodandaram over allying with TDP
Visuals: Drought Mahabubnagar Kollapur turns GREEN !..
Visuals: Drought Mahabubnagar Kollapur turns GREEN !
Big Debate : TRS Vs Mahakutami and BLF..
Big Debate : TRS Vs Mahakutami and BLF
Defectors Pelting Stones is Common: KTR on Konda..
Defectors Pelting Stones is Common: KTR on Konda
Cong to suspend R Komatireddy ?..
Cong to suspend R Komatireddy ?
Roll Rida about Kaushal in Bigg Boss house..
Roll Rida about Kaushal in Bigg Boss house
Manchu Manoj responds to a Troll on him..
Manchu Manoj responds to a Troll on him
BB2: Review on Housemates Dislikes on Kaushal, Samrat sli..
BB2: Review on Housemates Dislikes on Kaushal, Samrat slip
Nagarjuna Shocking Comments on Bigg Boss Show..
Nagarjuna Shocking Comments on Bigg Boss Show
Jagga Reddy slams CM KCR; Warns Him..
Jagga Reddy slams CM KCR; Warns Him
CM Chandrababu BIOPIC Chandrodayam Movie First Look..
CM Chandrababu BIOPIC Chandrodayam Movie First Look
Konda Murali sensational comments at KCR's family..
Konda Murali sensational comments at KCR's family
Undavalli reminds late YSR's counter to late NTR..
Undavalli reminds late YSR's counter to late NTR
Nani comments on Bigg Boss 2 @ Devadas Movie Press Meet..
Nani comments on Bigg Boss 2 @ Devadas Movie Press Meet