snapdeal: రెండు రోజులు స్నాప్‌డీల్ లో బంపర్ ఆఫ‌ర్‌.. భారీ డిస్కౌంట్!

ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు సాగిస్తున్న ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ రెండురోజుల పాటు ‘వెల్‌కమ్‌ 2017’ పేరుతో ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ను వినియోగ‌దారుల ముందు ఉంచుతున్న‌ట్లు తెలిపింది. ఈ నెల 8, 9వ‌ తేదీల్లో త‌మ వెబ్‌సైట్ ద్వారా దాదాపు 70 శాతం డిస్కౌంట్‌తో వ‌స్తువుల‌ను అందించ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ ఆఫ‌ర్ ద్వారా డ్రెస్‌, మొబైల్‌ఫోన్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు పొంద‌వ‌చ్చ‌ని చెప్పింది. ఈ సేల్ ద్వారా మొబైల్‌ఫోన్ల విభాగంలో రెడ్‌మి నోట్‌3, శామ్‌సంగ్‌ జె2 ప్రొ (16జీబీ), ఐ ఫోన్‌ 5ఎస్‌ (16జీబీ), ఐఫోన్‌7 (32జీబీ), ఐఫోన్‌ 6ఎస్‌ (32జీబీ)లను అందుబాటులో ఉంచుతున్న‌ట్లు తెలిపింది. వాటితో పాటు క‌స్ట‌మ‌ర్లు ఎస్‌బీఐ కార్డును ఉప‌యోగించి కొనుగోలు చేస్తే 15శాతం వరకు అదనపు డిస్కౌంట్ కూడా పొంద‌వ‌చ్చ‌ని బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఆ కార్డుతో పాటు ఇత‌ర‌ అన్ని ప్రముఖ క్రెడిట్‌ కార్డులపై వడ్డీ రహిత ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్న‌ట్లు పేర్కొంది.

More Telugu News