firing: జమ్ముకశ్మీర్‌లో ఎమ్మెల్సీ ఇంటిపై కాల్పుల‌కు తెగ‌బ‌డ్డ‌ ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మ‌రోసారి రెచ్చిపోయారు. ఓ ఎమ్మెల్సీ ఇంటిపై కాల్పులు జ‌రిపి అల‌జ‌డి రేపారు. ఈ ఘ‌ట‌న గురించి పోలీసులు చెబుతూ.. ఆ రాష్ట్రంలోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎమ్మెల్సీ షౌకత్‌ గని నివాసంపై ఈ కాల్పులు జ‌రిగాయ‌ని, ఆ ఇంటి సెక్యూరిటీ గార్డ్‌ వెంటనే అప్రమత్తమై ఉగ్ర‌వాదుల‌పై ఎదురుకాల్పులకు దిగ‌డంతో వారు అక్క‌డి నుంచి పారిపోయార‌ని చెప్పారు. ఆ స‌మ‌యంలో ఎమ్మెల్సీ ఇంట్లో లేడ‌ని చెప్పారు. ఈ ఘటనలో ఇంట్లో ఎవరికీ గాయాలు కాలేదని వివ‌రించారు.

More Telugu News