sharukh khan: ‘రయీస్‌’ సినిమా చూసేటప్పుడు ఫోన్‌ వాడకూడదు: షారుఖ్ ఖాన్ సూచన

బాలీవుడ్ న‌టులు షారుఖ్ ఖాన్‌, మ‌హీరా ఖాన్‌, న‌వాజుద్దీన్ ప్ర‌ధాన పాత్రల్లో న‌టిస్తోన్న ‘రయీస్‌’ సినిమాలోని ‘ఓ జాలిమా’ అనే పాట టీజర్‌ను షారుక్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ పాటను పూర్తిగా రేపు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా షారుఖ్ స్పందిస్తూ ఈ పాట వచ్చినా రాకపోయినా జాలిమా కోసం పాడక తప్పదని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నాడు. ఈ సినిమాను థియేటర్లో చూసేటప్పుడు ఫోన్లు వాడకూడదని కూడా షారుక్‌ ఖాన్ సూచించాడు. రాహుల్‌ ఢోలకియా దర్శకత్వం వహించిన ‘రయీస్‌’ మూవీ ఈ నెల 25న విడుద‌ల కానుంది. ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌కుడిగా రామ్‌ సంపత్ ప‌నిచేస్తున్నారు.



More Telugu News